: చంద్రబాబు కష్టపడినట్లు నేను కష్టపడలేకపోతున్నాను: ఎంపీ రాయపాటి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కష్టపడినట్లు తాను కష్టపడలేకపోతున్నానని టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావు అన్నారు. ఒక టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఆ విధంగా మాట్లాడారు. చంద్రబాబు రోజుకు 18 గంటలపాటు కష్టపడతారని, తాను 10 గంటలు కూడా కష్టపడలేకపోతున్నానని అన్నారు. వయసు రీత్యా తాను ఎక్కువగా పనిచేయలేకపోతున్నానని చెప్పారు. 1982లో తానెవరో పూర్తిగా తెలియకపోయినప్పటికీ, కాంగ్రెస్ పార్టీ తరపున రాజ్యసభకు తాను నామినేషన్ వేసే అవకాశాన్ని ఇందిరాగాంధీ కల్పించారన్నారు. ఆనాటి నుంచి ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీలతో సాన్నిహిత్యం ఉందని, వాళ్ల ఇంట్లో సభ్యుడిగానే మెలిగానని రాయపాటి చెప్పారు.