: రేపు కిర్లంపూడికి సినీ దర్శకుడు దాసరి

కాపులను బీసీల్లో చేర్చాలని డిమాండ్ చేస్తూ మూడు రోజుల క్రితం ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించిన ముద్రగడ పద్మనాభం దంపతులను దర్శకుడు దాసరి కలవనున్నారు. ఇందుకోసం రేపు కిర్లంపూడికి బయలుదేరి వెళ్లనున్నట్లు ఆయన చెప్పారు. ముద్రగడ దీక్షకు సంఘీభావం తెలుపుతున్నట్లు దాసరి ఇంతకుముందు ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా, కాపు నేత ముద్రగడ దీక్షకు మద్దతు ప్రకటిస్తున్న పలువురు నేతలు కిర్లంపూడికి వస్తున్నప్పటికీ పోలీసులు వారిని వెనక్కి పంపిస్తున్నారు. ఈ నేపథ్యంలో రేపు కిర్లంపూడికి వెళ్లనున్న దాసరిని ముద్రగడను కలవడానికి అనుమతిస్తారా? లేక అడ్డుకుంటారా? అనే విషయమై ఆసక్తి నెలకొంది.

More Telugu News