: ద్విచక్రవాహనంపై ముద్రగడ నివాసం చేరుకున్న సి.రామచంద్రయ్య

తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలోని ముద్రగడ పద్మనాభం నివాసానికి కాంగ్రెస్ నేత సి.రామచంద్రయ్య చేరుకున్నారు. ముద్రగడ దీక్షకు మద్దతు తెలిపేందుకు కిర్లంపూడి చేరుకునేందుకు సమాయత్తమైన కాపు నేతలు, కార్యకర్తలను ఊరి సరిహద్దుల్లోనే పోలీసులు అడ్డుకుంటున్నారు. దీంతో పోలీసులపై అంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపధ్యంలో సి.రామచంద్రయ్య ద్విచక్రవాహనంపై మాజీ మంత్రి వట్టి వసంతకుమార్ తో కలిసి కిర్లంపూడిలోని ముద్రగడ నివాసం చేరుకున్నారు. అక్కడ వారిద్దరినీ పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వారిద్దరూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

More Telugu News