: అవును, అక్కడ ఫ్యాన్స్ పెరిగిపోతున్నారు...'తెలుగు రాష్ట్ర సమితి'గా మార్చాలా?: కేటీఆర్ చమత్కారం

టీఆర్ఎస్ కు ఆంధ్రప్రదేశ్ లో ఫ్యాన్స్ పెరిగిపోతున్నారని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ నవ్వుతూ అన్నారు. హైదరాబాదులో ఓ టీవీ ఛానెల్ తో మాట్లాడిన సందర్భంగా, తెలంగాణ రాష్ట్ర సమితిని 'తెలుగు రాష్ట్ర సమితి'గా మారుస్తామన్న విషయాన్ని ఏం చేశారు? అనగానే నవ్వేసిన కేటీఆర్...'అవును నిజమే! అక్కడ కూడా ఫ్యాన్స్ పెరిగిపోతున్నారు, తెలుగు రాష్ట్ర సమితిగా మార్చాలేమో' అని చమత్కరించారు. రెండు తెలుగు రాష్ట్రాలు బాగుండాలని కోరుకుంటామని చెప్పిన ఆయన, తెలంగాణ ఓ పిసరు ఎక్కువ బాగుండాలని కోరుకుంటామని అన్నారు. హుదూద్ సమయంలో విశాఖకు, అమరావతికి, శ్రీశైలం నీరు విడుదల సందర్భాల్లో టీఆర్ఎస్ ప్రజలను ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదని ఆయన స్పష్టం చేశారు. రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలు బాగుండాలని ఆయన ఆకాంక్షించారు.

More Telugu News