: భుజం గాయం నుంచి కోలుకుంటున్న చిరంజీవి
ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో భుజం గాయానికి మైనర్ ఆపరేషన్ చేయించుకున్న సినీ నటుడు, రాజ్యసభ సభ్యుడు చిరంజీవి మెల్లగా కోలుకుంటున్నారు. ఇవాళ సాయంత్రం గానీ, రేపుగానీ ఆయన హైదరాబాద్ కు వచ్చే అవకాశం ఉందని సమాచారం. తరువాత పూర్తిగా కోలుకోగానే ఆయన 150వ చిత్రం 'కత్తి' రీమేక్ షూటింగును మార్చిలో ప్రారంభించవచ్చని తెలుస్తోంది. షూటింగుకు అంతరాయం కలగకూడదన్న ఉద్దేశంతోనే చిరు ముందుగానే ఇలా సన్నద్ధమవుతున్నారని మెగా ఫ్యాన్స్ అంటున్నారు.