: ఏపీలో వెనుకబడిన జిల్లాలకు ఆర్థికసాయం కోరాం: ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి

ఢిల్లీలో ఇవాళ జరిగిన రాష్ట్రాల ఆర్థిక మంత్రుల సమావేశానికి ఏపీ నుంచి ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి పీవీ రమేష్ హాజరయ్యారు. రాష్ట్రానికి కావాల్సిన సహాయంపై వివరించారు. రాష్ట్రంలో వెనుకబడిన 7 జిల్లాలకు రూ.200 కోట్ల చొప్పున ఆర్థిక సాయం అడిగినట్టు సమావేశం ముగిసిన అనంతరం మీడియాకు చెప్పారు. పారిశ్రామిక రాయితీలు కూడా కొంతవరకే ఇచ్చారని, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ తరహాలో ఏపీకి రాయితీలు ఇవ్వాలని కోరామని తెలిపారు. విభజన తరువాత ఏపీ కేంద్రంపైనే ఆధారపడాల్సిన పరిస్ధిితి ఏర్పడిందన్నారు. చట్టప్రకారం రాష్ట్రానికి చాలావరకు రావాల్సి ఉందన్న కార్యదర్శి, రాజధాని నిర్మాణానికి బడ్జెట్ లోనే రూ.4వేల కోట్లు కేటాయించాలని కోరినట్టు వివరించారు.

More Telugu News