: భూటాన్ రాజు దంపతులకు ఆడపిల్ల పుట్టింది

భూటాన్ రాజు జిగ్నే ఖేసర్ సంగ్యల్ వాంగ్ చుక్, రాణి జెస్తన్ పెమా దంపతులకు పుత్రికోత్సాహం కలిగింది. దేశ రాజధాని థింపులోని లింకానా ప్యాలెస్ లో రాణి జెస్తన్ ఆడశిశువుకు జన్మనిచ్చింది. భూటాన్ ప్రజల ఆశీర్వాదంతో రాణి, రాకుమారి ఇద్దరు క్షేమంగా ఉన్నారని రాజభవనం ప్రతినిధులు వెల్లడించారు. దాంతో భూటాన్ రాజవంశంలోకి బుల్లి రాకుమారి వచ్చిందంటూ దేశ ప్రజలు ఆనందోత్సాహాల్లో మునిగిపోయారు. ఈ సందర్భంగా భూటాన్ రాజు దంపతులను అభినందిస్తూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ ట్విట్టర్ లో శుభాకాంక్షలు తెలిపారు.

More Telugu News