: కొరియా పర్యటనకు చంద్రబాబు... 20 నుంచి ఐదు రోజుల పాటు విదేశీ టూర్
నవ్యాంధ్ర ముఖ్యమంత్రి హోదాలో టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు మరో విదేశీ పర్యటనకు సమాయత్తమవుతున్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్న నవ్యాంధ్రకు పెట్టుబడుల సాధనే లక్ష్యంగా ఇప్పటికే పలు దేశాల్లో పర్యటించిన చంద్రబాబు మంచి ఫలితాలనే సాధించారు.
తాజాగా కొరియా దేశాల్లో పర్యటించేందుకు ఆయన ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. ఈ నెల 20న కొరియా పర్యటనకు బయలుదేరనున్న చంద్రబాబు 25 దాకా అక్కడే ఉంటారు. ఈ పర్యటనలో చంద్రబాబు వెంట ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్ రావు, ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ తో పాటు వివిధ కీలక శాఖల అధికారులు కూడా వెళ్లనున్నారు.