: యూరప్ లో తొలి సముద్రగర్భ మ్యూజియం!
సముద్రం లోపల ఒక మ్యూజియంను ఏర్పాటు చేయడమే కాకుండా, అది ఉన్న ప్రాంతంలో బయోమాస్ ని పెంచేందుకు స్పెయిన్ ప్రభుత్వం ముందడుగు వేసింది. యూరప్ లో తొలి సముద్ర గర్భ మ్యూజియంను ఏర్పాటు చేసింది. ప్రముఖ బ్రిటిష్ శిల్పి జాసన్ డికెయిర్స్ టేలర్ ఆధ్వర్యంలో స్పెయిన్ లాంజరోట్ లోని సముద్ర గర్భంలో రూపొందించిన ఈ మ్యూజియం పేరు అట్లాంటిక్. సముద్ర మట్టానికి 12 మీటర్ల లోతులో ఉన్న ‘అట్లాంటిక్’లో టేలర్ చెక్కిన శిల్పాలు 400 వరకు ఉన్నాయి. ఈ మ్యూజియం ఉన్న ప్రాంతంలో బయోమాస్ ని అభివృద్ధి చేయడంతో పాటు జీవజాతులన్నీ ఇక్కడ పెరిగేందుకు ప్రభుత్వ అధికారులు ప్రయత్నిస్తున్నారు. అయితే, డైవింగ్ వచ్చిన వారెవరైనా సరే ఈ మ్యూజియాన్ని సందర్శించవచ్చు. కాగా, ఈ మ్యూజియం రూపకర్త జాసన్ డికెయిర్స్ టేలర్ గతంలో కూడా ఇదే తరహా మ్యూజియంను ఐరోపా ఖండంలో రూపొందించాడు.