: కొనసాగుతున్న గ్రేటర్ కౌంటింగ్... 5.30కు తొలి ఫలితం వచ్చే అవకాశం
గ్రేటర్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ల ఓట్లను ఎన్నికల సిబ్బంది లెక్కించారు. ప్రస్తుతం ఈవీఎంలను తెరచి ఓట్లను లెక్కిస్తున్నట్టు తెలుస్తోంది. 5 గంటల తరువాతే ఫలితాలు వెల్లడించాలన్న ఎన్నికల కమిషన్ నిబంధన మేరకు, మీడియాకు ఫలితాల వివరాలు తెలుస్తున్నప్పటికి నిబంధనను అనుసరించి ఎవరూ వెల్లడించడం లేదు. మరోవైపు ఫలితాలపై అన్ని పార్టీల అభ్యర్థులు తీవ్ర ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. తొలి ఫలితాన్ని జీహెచ్ఎంసీ కమినర్ జనార్దన్ రెడ్డి స్వయంగా వెల్లడించే అవకాశం ఉందని సమాచారం.