: మలేషియా ఎయిర్ పోర్టులో నయనతారకు చుక్కెదురు!
దక్షిణాది హీరోయిన్ నయనతారకు మలేషియాలో చుక్కెదురైంది. ఒక సినిమా షూటింగ్ నిమిత్తం ఆమె మలేషియా వెళ్లింది. అనంతరం భారత్ కు తిరిగి ప్రయాణమైన సందర్భంలో ఆమె పాస్ పోర్ట్ వివాదంలో చిక్కుకుంది. పాస్ పోర్టులోని ఫొటోకు.. నయనతార ముఖ కవళికలకు కొద్దిగా తేడా ఉందంటూ మలేషియా కస్టమ్స్ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో నిన్న సాయంత్రం నుంచి ఈరోజు
ఉదయం వరకు ఆమె ఎయిర్ పోర్ట్ లోనే గడపాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో ఆమెపై వారు పలు ప్రశ్నలు వేశారు. పూర్తి స్థాయి స్పష్టత వచ్చిన తర్వాత నయనతారను ప్రయాణించేందుకు అధికారులు అనుమతి ఇవ్వడంతో ఆమె అక్కడి నుంచి బయలుదేరినట్లు సమాచారం.