: ‘ముద్రగడ’ దంపతులకు వైద్యపరీక్షలు

కాపులను బీసీల్లో చేర్చాలంటూ ఈరోజు ఉదయం ఆమరణ దీక్ష ప్రారంభించిన ముద్రగడ పద్మనాభం దంపతులకు ప్రభుత్వవైద్యులు పరీక్షలు నిర్వహించారు. బీపీ, షుగర్ లెవెల్స్ సాధారణ స్థాయిలోనే ఉన్నాయని చెప్పిన వైద్యులు ఇందుకు సంబంధించిన వివరాలను తెలిపారు. ముద్రగడ బరువు - 84 కిలోలు, బీపీ-160/110, షుగర్-178 కాగా, ఆయన భార్య పద్మావతి బీపీ-180/110, బ్లడ్ షుగర్-121 ఉందని వైద్యులు పేర్కొన్నారు. కాగా, తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో ముద్రగడ దంపతుల ఆమరణ నిరాహార దీక్షకు కాపు నేతలు, కులస్తులు తమ మద్దతు తెలుపుతున్నారు. తనకు మద్దతు తెలిపేందుకని ఇక్కడికి ఎవరూ రావద్దని ముద్రగడ విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే.

More Telugu News