: పైలట్ లేక ఆగిన జెట్ ఎయిర్ వేస్ విమానం... 2 గంటల పాటు కేంద్ర మంత్రుల పడిగాపులు
కేరళలోని కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయంలో నిన్న ఇద్దరు కేంద్ర మంత్రులు రెండు గంటల పాటు పడిగాపులు కాశారు. నిన్న కొచ్చికి వచ్చిన కేంద్ర మంత్రులు ప్రకాశ్ జవదేకర్, పీయూష్ గోయల్ లు అక్కడి నుంచి ముంబై వెళ్లేందుకు సాయంత్రం 4.20 గంటలకు ఎయిర్ పోర్టుకు వచ్చారు. వారు ఎక్కాల్సిన జెట్ ఎయిర్ వేస్ విమానం రన్ వే పైనే ఉంది. విమానం సిద్ధంగా ఉండటంతో మంత్రులు విమానం ఎక్కేశారు.
అయితే ఎంతకీ విమానం కదలలేదు. కారణమేంటని ఆరా తీస్తే.. విమానం నడిపేందుకు పైలట్ అందుబాటులో లేడట. దీంతో దాదాపు రెండు గంటల పాటు అక్కడే పడిగాపులు కాసిన జవదేకర్ మరో విమానంలో ఢిల్లీకి వెళ్లిపోగా, ఇంకో విమానంలో గోయల్ ముంబై బయలుదేరారట.