: అండర్ వరల్డ్ డాన్ మా దేశంలో లేడు!: భారత్ కు తేల్చిచెప్పిన పాక్

భారత మోస్ట్ వాంటెడ్ క్రిమినల్, అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం పాకిస్థాన్ లో స్వేచ్ఛగా జీవిస్తున్నాడన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఎప్పటిలాగే అతడు తమ దేశంలో లేడని పాకిస్థాన్ మరోమారు ప్రకటించింది. ‘దావూద్ మా దేశంలో లేడు. అతడు మా దేశంలో అడుగుపెట్టకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం’ అని పాక్ ప్రభుత్వం భారత్ కు తెలిపింది. అంతేకాక దావూద్ తమ దేశంలోనే ఉంటున్నాడంటూ భారత్ పేర్కొన్న అడ్రెస్ తెలియడం లేదని కూడా ఆ దేశం పేర్కొంది. నిన్న బ్రిటన్ విడుదల చేసిన టెర్రరిస్టుల జాబితాలో భారత్ కు చెందిన వ్యక్తుల్లో దావూద్ ఒక్కడే ఉన్నాడు. ఇక సంస్థల విషయానికొస్తే కొన్ని సిక్కు సంస్థలను కూడా బ్రిటన్ ఉగ్రవాద సంస్థల జాబితాలో పేర్కొంది.

More Telugu News