: నన్ను కొడుతుంటే గన్ మెన్ స్పందించలేదు: ఇంటెలిజెన్స్ కు షబ్బీర్ అలీ లేఖ

నిన్న గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ముగిసిన అనంతరం, పాతబస్తీలో ఉన్న తనపై ఎంఐఎం కార్యకర్తలు దాడి చేసి కొడుతున్న సమయంలో తనకు సెక్యూరిటీగా ఉన్న గన్ మెన్ స్పందించలేదని మాజీ మంత్రి షబ్బీర్ అలీ ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ కు లేఖ రాశారు. తనపై దాడి చేసి పిడిగుద్దులు గుద్దుతున్నా, కారులో ముందు సీట్లో కూర్చున్న సెక్యూరిటీ, కనీసం కారు కూడా దిగలేదని ఆయన తన లేఖలో ఫిర్యాదు చేశారు. తనకు రక్షణగా ఉండాల్సిన వ్యక్తి, జరిగిన ఘటనను చూస్తూ ఉండిపోయాడని ఆరోపించిన ఆయన, ఈ దాడిలో తన కంటికి బలమైన గాయం అయిందని కూడా ప్రస్తావించారు. తక్షణం తన సెక్యూరిటీని సమీక్షించాలని ఆయన కోరినట్టు తెలుస్తోంది.

More Telugu News