: కొరియా క్షిపణి ప్రయోగంపై జపాన్ కన్నెర్ర... తమవైపుగా వస్తే పేల్చేస్తామని హెచ్చరిక!

ఉత్తర కొరియా త్వరలో చేపట్టనున్న క్షిపణి ప్రయోగాన్ని పొరుగుదేశం జపాన్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ నెల 8న ఆ ప్రయోగానికి అధికారికంగా కౌంట్ డౌన్ ప్రారంభిస్తున్నారు. 'శాటిలైట్'గా నామకరణం చేసిన ఈ క్షిపణి గనుక తమ గగనతలంలోకి ప్రవేశిస్తే పేల్చిపారేస్తామని జపాన్ స్పష్టం చేసింది. ఈ మేరకు శాటిలైట్ తమ పరిధిలోకి వస్తే గనుక తునాతునకలు చేయండంటూ జపాన్ రక్షణ శాఖ మంత్రి జనరల్ నకతాని సైన్యానికి ఆదేశాలు కూడా జారీ చేశారు. ఈ క్రమంలో ఉత్తరకొరియా సరిహద్దులో జపాన్ భారీగా సైన్యాన్ని మోహరించింది. ఇందుకోసం పీఏసీ-3, ఎస్ఎం-3 క్షిపణి విధ్వంసక వ్యవస్థను సిద్ధం చేసుకుంది. గత నెలలో హైడ్రోజన్ బాంబు ప్రయోగంతో ప్రపంచాన్ని ఆశ్చర్యపరచిన ఉత్తరకొరియా ఇటీవల అభివృద్ధి చేసిన ఈ ఖండాంతర క్షిపణితో మరెన్ని సమస్యలను సృష్టిస్తుందో చూడాలి.

More Telugu News