: రామాలయ నిర్మాణానికి ముస్లింల చేయూత!... భూమితో పాటు రూ.50 వేల నగదు అందజేత

ఓ వైపు ఉత్తరప్రదేశ్ లో రామ మందిరం నిర్మాణంపై హిందువులు, ముస్లింల మధ్య వివాదం నడుస్తూనే ఉంది. ఆ రాష్ట్రానికి పొరుగున ఉన్న మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఇందుకు పూర్తిగా భిన్నమైన ఘటన చోటుచేసుకుంది. మత సామరస్యానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన ఈ ఘటనలో ముస్లిం సోదరులు తమ గొప్ప మనసును చాటుకున్నారు. మధ్యప్రదేశ్ లోని మొరెనా జిల్లా ఖేదకలా గ్రామంలో ‘శ్రీరామ్ జానకీ ఆలయం’ నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని ఆ గ్రామానికి చెందిన ముస్లింలు దానమిచ్చారు. అంతేకాదు, గ్రామంలోని 80 ముస్లిం కుటుంబాలు తలా ఇంత అంటూ చందాలేసుకుని రామాలయ నిర్మాణానికి రూ.50 వేలను కూడా అందజేశారు. ‘‘ముస్లిం సోదరులు రామాలయ నిర్మాణానికి సాధ్యమైనంత మేర తోడ్పాటునందించారు’’ అని గ్రామ సర్పంచ్ సంత్ కుమార్ సింగ్ చెప్పారు.

More Telugu News