: ఎంఐఎం గూండాలతో అసదుద్దీన్ దాడి చేయించాడు: జానారెడ్డి
తన గూండాలతో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ టీఎస్ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కారుపై దాడి చేయించారని కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి మండిపడ్డారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, ఎంఐఎం గూండాలను పోలీసులు కట్టడి చేయాలని అన్నారు. ఉత్తమ్ కుమార్, షబ్బీర్ అలీలపై దాడిని ఖండిస్తున్నామని ఆయన చెప్పారు. హైదరాబాదులో శాంతి భద్రతల సమస్య ఉత్పన్నమయ్యేలా చేసిన అసదుద్దీన్, అతని అనుచరులపై కేసులు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి దీనిపై చర్యలు తీసుకోని పక్షంలో ప్రజాఉద్యమం వచ్చే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. హైదరాబాదులో ఇలాంటి చర్యలను టీఆర్ఎస్ పార్టీ ప్రోత్సహిస్తోందని ఆయన ఆరోపించారు. ఎంఐఎంతో టీఆర్ఎస్ పొత్తు పెట్టుకోవడం వల్లే వారు మితిమీరి వ్యవహరిస్తున్నారని జానారెడ్డి మండిపడ్డారు.