: ఉపాధి హామీ కూలీలతో ‘రాహుల్’ ముఖాముఖి
అనంతపురం జిల్లా నార్పల మండలంలోని బండ్లపల్లి గ్రామంలో ఉపాధి హామీ కూలీలు, ఫీల్డ్ అసిస్టెంట్లతో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సమావేశమయ్యారు. ఈరోజు మధ్యాహ్నం ఆయన ఇక్కడకు చేరుకున్నారు. ఉపాధి హామీ పథకం ప్రారంభించి పదేళ్లు పూర్తయిన సందర్భంగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, రాహుల్ అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్నారు. ప్రత్యేక విమానంలో వీరు పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నేతలు వీరికి ఘన స్వాగతం పలికారు. తొలుత సత్యసాయి సమాధిని దర్శించుకున్నారు. అనంతరం బండ్లపల్లి లో ఉపాధి హామీ కూలీలు, ఫీల్డ్ అసిస్టెంట్లతో రాహుల్ మాట్లాడారు. ఉపాధి హామీ పథకం వల్లే తమకు ఉపాధి లభించిందని, లేకపోతే వలసలు వెళ్లాల్సి వచ్చేదని కూలీలు ఆయనతో అన్నారు.