: ఖైరతాబాద్ లో ఓటు వేసిన గవర్నర్ దంపతులు

తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్, ఆయన భార్య విమల ఓటు వేశారు. హైదరాబాద్ లోని ఖైరతాబాద్ లో ఉన్న 17వ పోలింగ్ కేంద్రంలో వారిద్దరూ ఓట హక్కు వినియోగించుకున్నారు. మరోవైపు అజాంపురాలో తెలంగాణ ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ, మారేడుపల్లిలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, చిక్కడపల్లిలో బీజేపీ ఎమ్మెల్యే లక్ష్మణ్, హిమాయత్ నగర్ లో మంత్రి కేటీఆర్ సతీమణి శైలిమ విధిగా ఓటు వేశారు. ఇక నారావారి కుటుంబం కూడా గ్రేటర్ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకుంది. నారా భువనేశ్వరి, లోకేశ్, బ్రాహ్మణి జూబ్లీహిల్స్ లో ఓటు వేశారు.

More Telugu News