: కేటీఆర్ కు అందని పోలింగ్ స్లిప్... ఆయన భార్యకైతే ఓటేలేదట!
తెలంగాణ రాష్ట్ర సమితి తరఫున అన్నీ తానై ప్రచారాన్ని నడిపించిన ఐటీ మంత్రి కేటీఆర్ కు జీహెచ్ఎంసీ సిబ్బంది పోలింగ్ స్లిప్ ను అందించలేదని తెలుస్తోంది. కేటీఆర్ బంజారాహిల్స్ లోని రోడ్డు నెంబర్ 14లో ఉన్న నందీనగర్ లో నివసిస్తుండగా, అక్కడే ఆయనకు ఓటుంది. నిన్న సాయంత్రం వరకూ ఆయనకు పోలింగ్ స్లిప్ ఇవ్వలేదని సమాచారం. ఇదిలావుండగా, ఆయన భార్య శైలిమకు అసలు ఓటే లేదని అధికారులు చెబుతున్నారు. 2014 అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ ఆమెకు ఓటు లేదని ఎన్నికల సిబ్బంది చెబుతున్నారు. ఆమె స్వగ్రామంలో కూడా ఓటు హక్కు లేదని తెలుస్తోంది.