: జగన్.. అద్దం ముందు కూర్చుంటే నేరస్తులెవరో కనిపిస్తారు: స్పీకర్ కోడెల
వంగవీటి రంగా హత్యకు సంబంధించి తనపై వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తనను బాధించాయని ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ వ్యాఖ్యలకు తాను బదులివ్వకపోతే ప్రజలు నిజమని నమ్మే ప్రమాదముందని, తాను హోంమంత్రిగా ఉన్నప్పుడు వంగవీటి రంగా హత్య జరిగిందని అన్నారు. రంగా హత్య తర్వాత తీవ్రమైన అల్లర్లు చెలరేగాయని, దీంతో ఆవేదన చెందిన తాను నాడు రాజీనామా చేశానని అన్నారు. వంగవీటి రంగాతో తనకు స్నేహమూ లేదు, వైరమూ లేదని అన్నారు. అద్దం ముందు కూర్చుంటే నేరస్తులు ఎవరో జగన్ కు కనిపిస్తారని, జగన్ కు రాజకీయ పరిపక్వత లేదని విమర్శించారు.