: చట్టబద్ధత కల్పించేందుకే కమిషన్ వేశాం: చంద్రబాబు
కాపు రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించేందుకే కమిషన్ వేశామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. కమిషన్ కు 9 నెలల కాలపరిమితి పెట్టామని, వెనుకబడిన తరగతులకు నష్టం వాటిల్లకుండా సమస్యను పరిష్కరించేందుకు కసరత్తు చేస్తున్నామన్నారు. కాపులకు ఎంత శాతం రిజర్వేషన్ ఇవ్వాలన్నా కమిషన్ నివేదిక అవసరమని, అది రాకుండా ఏమీ చేయలేమని చెప్పారు. తప్పుడు జీవోల వల్ల సమస్య పరిష్కారం కాదని అన్నారు. కమిషన్ నివేదిక వచ్చిన తర్వాత అవసరమైన అన్ని జీవోలు ఇస్తామని, నిర్ణీత కాలపరిమితి ప్రకారం కాపు కులస్తులకు మేలు చేస్తామని చంద్రబాబు పేర్కొన్నారు.