: బోరు బావిలో రెండేళ్ల చిన్నారి!
నిమ్మతోటలో ఆటలాడుకుంటున్న రెండేళ్ల సాన్వీ ప్రమాదవశాత్తు బోరుబావిలో పడిన సంఘటన నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలం వల్లాల వద్ద జరిగింది. సుమారు 30 అడుగుల లోతులో ఉన్న ఈ బోరుబావిలో చిన్నారి పడిపోయింది. బోరుబావిలో నుంచి ఆమె అరుపులు విన్పిస్తున్నాయి. బావి తవ్వకం పనుల నిమిత్తం వేరే ఊరి నుంచి వల్లాలకు సాన్వి తల్లిదండ్రులు వచ్చారు. చిన్నారిని రక్షించేందుకు ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయి. బోరు బావికి సమాంతరంగా జేసీబీతో గుంత తవ్వించి .. చిన్నారిని రక్షించేందుకు పోలీసులు, 108 సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.