: ఏం జరిగినా చంద్రబాబుదే బాధ్యత: జగన్
రాష్ట్రంలో ఎటువంటి హింసాకాండలు జరిగినా దానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిదే బాధ్యతని వైకాపా నేత వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. పలు సామాజిక వర్గాల్లో ఏపీ ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగిపోతుందని అన్న జగన్, అందరూ ఉద్యమాలకు దిగేందుకు ముందుకు వస్తున్నారని, అవాంఛనీయ ఘటనలు జరిగితే, అందుకు ప్రభుత్వానిదే బాధ్యతని అన్నారు. ఎన్నో హామీలను చంద్రబాబు విస్మరించారని, అందుకు వ్యతిరేకత ఎదుర్కోవాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. ప్రతిదానికీ వైకాపా నేతలే కారణమంటూ ఆయన ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని విమర్శించారు. నిరుద్యోగులు, రైతులు, డ్వాక్రా మహిళా సంఘాలు, సాధారణ ప్రజలు చంద్రబాబును అసహ్యించుకుంటున్నారన్న జగన్, తెలుగుదేశం ప్రభుత్వం పతనమయ్యే రోజు దగ్గర్లోనే ఉందని జోస్యం చెప్పారు.