: హైదరాబాద్ అభివృద్ధిలో చంద్రబాబు పాత్ర కూడా ఉంది!: కేటీఆర్

హైదరాబాద్ అభివృద్ధిలో చంద్రబాబునాయుడి పాత్ర కూడా ఉందని టీఆర్ఎస్ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఈ ఉదయం ప్రారంభమైన ‘ద స్పిరిట్‌ ఆఫ్‌ హైదరాబాద్‌’ సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించారు. చంద్రబాబు వ్యూహాత్మకంగా నగరాన్ని డెవలప్ చేశారని, ప్రపంచంలో పెట్టుబడులకు మంచి మార్కెట్ గా నిలిపారని, విలువైన ఇన్వెస్ట్ మెంట్స్ ను రాష్ట్రానికి తీసుకువచ్చారని అన్నారు. అయితే, ఈ నగరాభివృద్ధికి తానొక్కడినే బాధ్యుడిగా చెప్పుకుంటూ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని విమర్శించారు. ఈ నగరానికి 400 ఏళ్ల చరిత్ర ఉందని గుర్తు చేసిన ఆయన, హైదరాబాద్ ను ఎవరో ఒకరు నిర్మించలేదని, శతాబ్దాలుగా విస్తరిస్తూ వస్తోందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఇక్కడి ప్రజలకు గౌరవ భావం అధికమని, పక్కవారికి సాయపడటం హైదరాబాదీల ప్రధాన లక్షణాల్లో ఒకటని తెలిపారు.

More Telugu News