: మోదీ సర్కారుకు కూడా ఇందిరమ్మకు పట్టిన గతే!: బీజేపీ సీనియర్ యశ్వంత్ సిన్హా సంచలన వ్యాఖ్య

ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం ఎన్నో రంగాల్లో విఫలమవుతోందని, ఎమర్జెన్సీ తరువాత ఇందిరా గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీకి పట్టిన గతే బీజేపీకి పట్టనుందని ఆ పార్టీ సినియర్ నేత యశ్వంత్ సిన్హా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ చర్చా వేదికలో సీపీఎం కార్యదర్శి సీతారాం ఏచూరితో కలసి పాల్గొన్న ఆయన ప్రసంగిస్తూ, ప్రస్తుతం ఇండియాలో పరిస్థితి రోజురోజుకూ దిగజారుతోందని అన్నారు. బీజేపీ త్వరితంగా స్పందించకుంటే, మరోసారి ఎన్నికలు రాకముందే ప్రజల చీత్కారాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు. వాజ్ పేయి ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా పనిచేసిన యశ్వంత్ సిన్హా, మోదీ పేరును వెల్లడించకుండానే ఈ విమర్శలు చేశారు. ఏ అంశాన్ని కూడా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, గత 19 నెలల పరిపాలనంతా ఒకేలా సాగిందని చెప్పిన ఆయన, 1977లో కాంగ్రెస్ పార్టీ అధికారానికి దూరమైన విషయాన్ని గుర్తు చేశారు.

More Telugu News