: నీటిలో బుల్లెట్ చలన వేగాన్ని తెలుసుకునేందుకు ప్రాణాలకు తెగించిన శాస్త్రవేత్త
నీటిలో బుల్లెట్ చలనవేగాన్ని తెలుసుకోవాలని భావించిన యవ పరిశోధకుడు ప్రాణాలకు తెగించాడు. తుపాకీతో కాలుస్తానంటే ఎవరూ ముందుకురారని భావించిన నార్వేకు చెందిన భౌతికశాస్త్రవేత్త ఆండ్రూస్ సోల్ బెర్గ్ తానే తుపాకీ గుళ్లకు ఎదురు నిలిచాడు. నీటిలో చలన వేగం ఎంత తక్కువ ఉంటుందో చూపేందుకు ఈ ప్రయోగం చేశారు. స్విమ్మింగ్ పూల్ లో తుపాకీని పెట్టిన ఆయన కొంత దూరంలో దాని రిమోట్ పట్టుకుని స్థిరంగా నిలబడ్డారు. ఈ ఈతకొలనులో కెమెరాలు అమర్చారు. అనంతరం రిమోట్ తో ఆ తుపాకీని పేల్చారు. వేగంగా దూసుకొచ్చిన తూటా దాని వేగానికి నీరు అడ్డుకట్ట వేయడంతో ఆయనను చేరకుండానే కిందపడింది. ఈ వీడియోను ఆయన సోషల్ మీడియాలో పోస్టు చేయగా, ఇప్పటి వరకు 7 మిలియన్ల మంది వీక్షించారు. ఆయనకు ఇలాంటి సాహస కృత్యాలు చేయడం కొత్త కాదని, బరువును కాళ్లకు కట్టుకుని ఎత్తైన ప్రదేశాల నుంచి కిందికి దూకడం వంటి పరిశోధనలు ఆయన చేశారని ఆయన గురించి తెలిసిన వారు చెబుతున్నారు.