: మరో ‘ఉగ్ర’ కలకలం... పాటియాలలో తుపాకులతో నలుగురు వ్యక్తులు, కారు అపహరణ

పఠాన్ కోట్ పై జరిగిన ఉగ్రవాదుల దాడిని మరువక ముందే పంజాబ్ లో మరోమారు ఉగ్రవాదుల కలకలం రేగింది. నేటి ఉదయం ఆ రాష్ట్రంలోని పాటియాలలో తుపాకులు చేతబట్టిన నలుగురు వ్యక్తులు రోడ్లపైకి వచ్చారు. కారులో వెళుతున్న ఓ వ్యక్తిని తుపాకులతో బెదిరించి అతడి కారును తీసుకెళ్లారు. తుపాకులు ఎక్కపెట్టిన నేపథ్యంలో తీవ్ర భయాందోళనలకు గురైన బాధితుడు ఆ వ్యక్తులు అటు వెళ్లగానే పరుగు పరుగున పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. అతడి నుంచి వివరాలు సేకరించిన పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పఠాన్ కోట్ ఉగ్రవాదుల తరహాలోనే కారు అపహరణకు గురి కావడంతో అక్కడ మరోమారు భయాందోళనలు నెలకొన్నాయి.

More Telugu News