: ఇక సంగ్మా వంతు!... విద్యార్ధుల దీక్షకు లోక్ సభ మాజీ స్పీకర్ మద్దతు

హైదరాబాదు సెంట్రల్ వర్సిటీలో వరుసగా చోటుచేసుకున్న పరిణామాలతో తీవ్ర ఆవేదనకు లోనై ఆత్మహత్య చేసుకున్న రీసెర్చి స్కాలర్ రోహిత్ వేముల ఘటన ఒక్క రాహుల్ గాంధీనే కాక కాంగ్రెస్ పార్టీ మాజీ నేత, లోక్ సభ మాజీ స్పీకర్ పీఏ సంగ్మాను కూడా కలచివేసింది. రోహిత్ బర్త్ డేను పురస్కరించుకుని వర్సిటీ విద్యార్థులు నిన్న రాత్రి నుంచి ప్రారంభించిన సామూహిక నిరాహార దీక్షకు సంగ్మా మద్దతు పలికారు. ఢిల్లీ నుంచి హైదరాబాదు వచ్చిన ఆయన నేరుగా సెంట్రల్ వర్సిటీకి చేరుకున్నారు. నిరసన దీక్షకు సంఘీభావంగా ఆయన దీక్షా స్థలిలో విద్యార్థుల పక్కన కూర్చున్నారు.

More Telugu News