: స్వచ్ఛ భారత్ లో కొత్త కార్యక్రమం... 'స్టాచ్యూ క్లీనింగ్'కు పిలుపునిచ్చిన మోదీ
ప్రధానమంత్రి నరేంద్రమోదీ దేశ ప్రజలకు మరో కొత్త కార్యక్రమంతో పిలుపునిచ్చారు. స్వచ్ఛ భారత్ లో భాగంగా విగ్రహ శుభ్రత('స్టాచ్యూ క్లీనింగ్') చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రతిఒక్కరూ పాల్గొనాలని కోరారు. ఇందుకోసం సోషల్ మీడియా వెబ్ సైట్ ట్విట్టర్లో ఓ హ్యాష్ ట్యాగ్ ను కూడా ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఈ క్రమంలో ప్రతి ఒక్కరూ తమ దగ్గర్లోని జాతి గర్వించదగ్గ మహనీయుల విగ్రహాలను శుభ్రం చేసి, ఆ ఫోటోను #statuecleaning ద్వారా ట్వీట్ చేయాలని కోరారు. రానున్న రోజుల్లో అందులో కొన్నింటిని తన ట్విట్టర్ ద్వారా రీట్వీట్ చేస్తానని మోదీ తెలిపారు.