: అరుణాచల్ ప్రదేశ్ లో రాష్ట్రపతి పాలనపై సుప్రీంలో కేంద్రం అఫిడవిట్
అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించడాన్ని కేంద్ర ప్రభుత్వం సమర్థించుకుంది. అరుణాచల్ లో రాష్ట్రపతి పాలన విధించడంపై ఇవాళ సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. అరుణాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం మైనారిటీలో ఉందని తెలిపింది. ఆ రాష్ట్ర కాంగ్రెస్ దాఖలు చేసిన పిటిషన్ నేపథ్యంలో రాష్ట్రపతి పాలనపై వివరణ ఇవ్వాలని సుప్రీం ఆదేశించింది. ఈ మేరకు ఇవాళ అఫిడవిట్ సమర్పించింది.