: సానియా ఇదే జోరు కొనసాగించాలి: కేసీఆర్

సానియా మీర్జా ఇదే జోరు కొనసాగించాలని, మరిన్ని విజయాలు సాధించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్షించారు. ఆస్ట్రేలియా ఓపెన్ మహిళల డబుల్స్ లో సానియా-మార్టినా జోడీ విజయం సాధించడంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సానియాకు కేసీఆర్ అభినందనలు తెలిపారు. రాష్ట్రానికి, దేశానికి ఎంతో మంచి పేరు తీసుకువచ్చిన ఆమె మరిన్ని విజయాలు సాధించాలన్నారు. కాగా, ఆస్ట్రేలియాపై టీ20 సిరీస్ గెలిచిన భారత మహిళా జట్టుకు కూడా కేసీఆర్ అభినందనలు తెలిపారు.

More Telugu News