: ముంబై జుహు తీరానికి కొట్టుకొచ్చిన భారీ తిమింగలం

ముంబైలోని అరేబియా సముద్ర తీరానికి అతిపెద్ద తిమింగలం ఒకటి కొట్టుకురావటం వచ్చింది. గత రాత్రి జుహు తీరానికి కొట్టుకువచ్చిన ఆ తిమింగలం 30 అడుగుల పొడవు ఉంది. దాన్ని చూసిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు సముద్ర తీరానికి వచ్చి చూడగా, అప్పటికే అది మరణించిందని గుర్తించారు. అయితే ఎలా మరణించిందన్న విషయంపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఇటీవల తమిళనాడులోని ట్యూటికోరన్ జిల్లాలో కూడా సముద్రతీరానికి దాదాపు వంద తిమింగలాలు కొట్టుకువచ్చిన సంగతి తెలిసిందే. మరోవైపు సముద్ర లోతుల్లో ఉండాల్సిన తిమింగలాలు ఇలా తీరప్రాంతాలకు ఎందుకు వస్తున్నాయన్న దానిపై మెరైన్ శాస్త్రవేత్తలు అధ్యయనం చేస్తున్నారు.

More Telugu News