: సత్తా చాటిన ‘వుమెన్ ఇన్ బ్లూ’!... ఆసీస్ పై టీ20 సిరీస్ క్లీన్ స్వీప్

టీమిండియా క్రికెట్ జట్లు సత్తా చాటుతున్నాయి. ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న టీమిండియా సీనియర్ జట్టు వన్డే సిరీస్ ను చేజార్చుకున్నా, టీ20 సిరీస్ లో భాగంగా మొన్నటి తొలి మ్యాచ్ లో జూలు విదిల్చింది. మరికాసేపట్లో ప్రారంభం కానున్న రెండో టీ20కి ధోనీ సేన సర్వసన్నద్ధమైంది. ఈ మ్యాచ్ ను గెలవడం ద్వారా ఇంకో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ ను చేజిక్కించుకోవాలని కృతనిశ్చయంతో ‘మెన్ ఇన్ బ్లూ’ బరిలోకి దిగుతున్నారు. ఈ క్రమంలో కొద్దిసేపటి క్రితం ఆస్ట్రేలియా జట్టుపైనే టీమిండియా మహిళల జట్టు రికార్డు విజయాన్ని నమోదు చేసింది. రెండు మ్యాచ్ ల సిరీస్ లో రెండింటిలోనూ విజయం సాధించిన టీమిండియా మహిళల జట్టు ఆసీస్ పై క్లీన్ స్వీప్ విజయం సాధించింది. కొద్దిసేపటి క్రితం మెల్ బోర్న్ లో ముగిసిన రెెండో టీ20లో భారత మహిళల జట్టు ఆసీస్ మహిళల జట్టుపై 10 వికెట్ల తేడాతో రికార్డు విజయాన్ని నమోదు చేసింది. ఈ సిరీస్ విజయంతో ఆసీస్ పై భారత మహిళల జట్టు తొలిసారి టైటిల్ నెగ్గినట్లైంది.

More Telugu News