: విజయవాడకు పారిపోలేదు...హైదరాబాదీలకు అండగా ఉంటా: చంద్రబాబు ఆసక్తికర కామెంట్స్

గ్రేటర్ హైదరాబాదు మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల ప్రచారం చివరి దశకు చేరుకుంది. ఈ నేపథ్యంలో టీడీపీ జాతీయ అధ్యక్షుడి హోదాలో ఏపీ సీఎం నిన్ననే ప్రచారంలోకి దిగిపోయారు. హైదరాబాదు శివారు పటాన్ చెరు నుంచి మొదలుపెట్టిన ప్రచారాన్ని ఆయన వివిధ ప్రాంతాల్లో కొనసాగించారు. నేడు కూడా ఆయన గ్రేటర్ లో ప్రచారం చేయనున్నారు. కొద్దిసేపటి క్రితం తన ఇంటి నుంచి బయటకు వచ్చిన చంద్రబాబు ఓ ప్రైవేట్ టీవీ ఛానెల్ తో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నట్లుగా తానేమీ హైదరాబాదు నుంచి విజయవాడకు పారిపోలేదని వ్యాఖ్యానించారు. పాలనా సౌలభ్యం కోసమే ఏపీకి తరలివెళ్లాల్సి వచ్చిందన్నారు. ఏపీకి వెళ్లినా టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా తెలంగాణలో పర్యటించే హక్కు తనకుందన్నారు. హైదరాబాదీలకు మునుపటిలాగానే టీడీపీ అండగా ఉంటుందని కూడా ఆయన ప్రకటించారు.

More Telugu News