: తెలంగాణ వైద్యులకు అన్యాయం జరగనివ్వం: కేసీఆర్ హామీ
ఉద్యోగుల విభజన విషయంలో తెలంగాణ వైద్యులకు అన్యాయం జరగనివ్వమని ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారు. ఉద్యోగుల విభజన, పదోన్నతుల్లో తెలంగాణ వైద్యులకు అన్యాయం జరిగిందంటూ సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రి వైద్యులు ఆందోళనకు దిగిన విషయమై కేసీఆర్ ను ప్రశ్నించగా పైవిధంగా ఆయన సమాధానమిచ్చారు. ఈవిషయమై తక్షణ చర్యలు తీసుకుంటామని.. వారికి అన్యాయం జరగనివ్వమని అన్నారు. కాగా, కమల్ నాథన్ కమిటీకి తప్పుడు సమాచారం ఇచ్చి తమకు అన్యాయం చేశారని, ఆంధ్రా వైద్యులను ఇక్కడే ఉంచారని, తెలంగాణ డాక్టర్లను ‘ఆంధ్రా’కు పంపించారని గాంధీ ఆసుపత్రి వైద్యులు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే.