: ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నన్నపనేని... ఉత్తర్వులు జారీ చేసిన చంద్రబాబు సర్కారు

నవ్యాంధ్రలో మరో నామినేటెడ్ పదవిని భర్తీ చేస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం నిన్న కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా టీడీపీ సీనియర్ నేత నన్నపనేని రాజకుమారి నియమితులయ్యారు. పార్టీకి చెందిన మహిళా నేతల్లో కీలక నేతగా వ్యవహరిస్తున్న నన్నపనేని, ప్రత్యక్ష ఎన్నికల్లో అంతగా రాణించలేకపోయారు. అయినప్పటికీ పార్టీ తరఫున బలమైన వాదన వినిపించే నేతగా ఆమె ఎదిగారు. ప్రతిసారీ సామాజిక వర్గాల సమీకరణలో భాగంగా పార్టీ ఆమెకు అంతగా ప్రాధాన్యం కల్పించలేకపోయిందన్న వాదన ఉంది. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకున్న పార్టీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు తాజాగా ఆమెకు కీలక పదవిని కట్టబెట్టారు. ఐదేళ్ల పాటు మహిళా కమిషన్ చైర్ పర్సన్ హోదాలో నన్నపనేని కొనసాగుతారని నిన్న వెలువరించిన ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది.

More Telugu News