: రవితేజను అనుకరించిన రకుల్ ప్రీత్, రాశి ఖన్నా
టాలీవుడ్ మాస్ మహరాజా రవితేజను హీరోయిన్లు రకుల్ ప్రీత్ సింగ్, రాశి ఖన్నా అనుకరించిన ఘటన చోటుచేసుకుంది. దేశం మొత్తం రిపబ్లిక్ డేను నిర్వహించుకుంటుండగా, రవితేజ గణతంత్ర దినోత్సవంతో పాటు పుట్టిన రోజు వేడుకలను కూడా నిర్వహించుకున్నాడు. ఈ సందర్భంగా సినీ రంగంలోని సన్నిహితులకు పార్టీ ఇచ్చాడు. ఈ పార్టీలో రకుల్, రాశి కలసి రవితేజ వేషధారణలో సందడి చేశారు. అచ్చం రవితేజలా మీసాలు అలంకరించుకున్న వీరిద్దరూ పార్టీలో అందర్నీ ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా రకుల్ ప్రీత్, రాశి ఖన్నా తీసుకున్న సెల్ఫీని రకుల్ తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్టు చేసింది.