: ఎయిర్ ఇండియా, జెట్ ఎయిర్ వేస్ విమానాలకు బాంబు బెదిరింపులు!

ఢిల్లీ నుంచి నేపాల్ వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా, జెట్ ఎయిర్ వేస్ విమానాలకు ఈరోజు బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో విమానశ్రయ సిబ్బంది అప్రమత్తమయ్యారు. వెంటనే బాంబు స్క్వాడ్ కు సమాచారం అందించారు. రెండు విమానాల్లో బాంబు స్క్వాడ్ బృందాలు తనిఖీలు చేపట్టాయి. భద్రతా కారణాల రీత్యా 9డబ్ల్యూ260 విమానాన్ని నిలిపివేసినట్టు జెట్ ఎయిర్ వేస్ అధికారులు పేర్కొన్నారు. దీంతో, ఖాట్మండు వెళ్లాల్సిన విమాన ప్రయాణికులు కొంత అసౌకర్యానికి గురయ్యారు.

More Telugu News