: ఎత్తయిన పర్వత శిఖరాన్ని అధిరోహించిన యూపీ మహిళా పోలీసు అధికారి

ఉత్తరప్రదేశ్ కు చెందిన మహిళా పోలీసు అధికారి అపర్ణ కుమార్ అరుదైన ఘనత సాధించారు. అంటార్కిటికా ఉపఖండంలోని అత్యంత ఎత్తయిన మౌంట్ విన్సన్ మాసిఫ్ శిఖరాన్ని (17వేల అడుగుల ఎత్తు) అధిరోహించి రికార్డు సృష్టించారు. తన సహచరులతో కలసి ఈ నెల 17న అపర్ణ ఆ ఫీట్ సాధించారు. శిఖరం అధిరోహించిన సమయంలో భారత పతాకం, రాష్ట్ర పోలీసు జెండాను అక్కడ ఎగురవేశారు. దాంతో దేశంలోనే ఈ ఘనతను సాధించిన తొలి ఐపీఎస్ అధికారిణిగా ఖ్యాతి గడించారు. ఈ క్రమంలో పలువురు ప్రముఖులు, ఐపీఎస్ అధికారులు అపర్ణను అభినందించారు. యూపీ సీఎం అఖిలేష్ యాదవ్ కూడా ఆమెకు అభినందనలు తెలిపారు. గతంలో హిమాచల్ ప్రదేశ్ కు చెందిన మహిళా పోలీసు ఉన్నతాధికారి రాధిక 7వేల మీటర్లకు పైగా ఎత్తులో ఉన్న మౌంట్ కన్ పర్వత శిఖరాన్ని అధిరోహించి రికార్డు నమోదు చేశారు. ఇప్పుడీ రికార్డును అపర్ణ అధిగమించారు.

More Telugu News