: మిలటరీ ఆసుపత్రి ఫోటోలు తీస్తూ పట్టుబడ్డ బంగ్లాదేశీయుడు

మిలటరీ ఆసుపత్రి పరిసరాల ఫోటోలు తీస్తూ అనుమానాస్పదంగా తిరుగుతున్న బంగ్లాదేశీయుడ్ని స్థానికులు పోలీసులకు పట్టించిన ఘటన కోల్ కతాలో చోటుచేసుకుంది. కోల్ కతాలోని కమాండ్ ఆసుపత్రిలో కూలి పనుల కోసం మహ్మద్ నూర్ ఇస్లాం అనే వ్యక్తి వెళ్లాడు. రాత్రి పది గంటల సమయంలో పని పూర్తి కావడంతో వారు వెళ్లిపోవాల్సి ఉంది. అయితే మహ్మద్ నూర్ మాత్రం అలా వెళ్ళకుండా నిషేధిత పరిసరాల్లో ఫోటోలు తీసుకుంటూ అనుమానాస్పదంగా తిరుగుతున్నాడు. దీంతో ఎవరు నువ్వు? ఫోటోలు ఎందుకు తీస్తున్నావు? అని ప్రశ్నించగా వారికి సరైన సమాధానాలు చెప్పలేదు. దీంతో వారు పోలీసులకు సమాచారం అందించగా వారు వచ్చి అతనిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఈ సందర్భంగా అతను బంగ్లాదేశీయుడని, కూలి పనుల నిమిత్తం కోల్ కతా వచ్చాడని పోలీసులు తెలిపారు. అతనికి ఉగ్రవాద లింకులపై పోలీసులు ఆరాతీస్తున్నారు.

More Telugu News