: మొదటిసారిగా ఇండియాను పొగిడిన డొనాల్డ్ ట్రంప్
అమెరికా అధ్యక్ష పదవికి పోటీ పడుతూ, నిత్యమూ విదేశీ ఉద్యోగులను తూలనాడే రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ నోట తొలిసారిగా 'ఇండియా' అన్న పదం వచ్చింది. మీడియాకు ఆయన ఇంటర్వ్యూ ఇస్తూ, "ఇండియా ఎంతో గొప్పగా పనిచేస్తోంది" అని పొగిడిన ఆయన, అందరూ ఇండియా గురించి మాట్లాడుతున్నారని, అమెరికా గురించి ఎవరూ చెప్పడం లేదని అన్నారు. తాను ఇండియాతో కలసి పనిచేయాలని భావిస్తున్నానని, తనకు ఆ దేశంతోనే అధికంగా పని ఉంటుందని కూడా అన్నారు. భారత్, చైనాల పనితీరు అమెరికాపై ప్రభావం చూపుతోందని అభిప్రాయపడ్డ డొనాల్డ్, ఇది అమెరికన్లకు సంబంధించినంత వరకూ దుర్వార్తేనని అన్నారు. ఇండియన్స్ పెద్దఎత్తున అమెరికాకు వస్తుండటం కారణంతోనే, నిరుద్యోగుల సమస్య పెరిగిందని విమర్శించే ఆయన నోటి వెంట పొగడ్తలు రావడం విశేషమే.