: టెక్కీలుగా మారుతున్నారా?... 2016లో బెస్ట్ కెరీర్ అవకాశాలు ఇవి!
ఇవాళా రేపు టెక్నాలజీ రంగం ఎన్నో ఉపాధి అవకాశాలను దగ్గర చేస్తోంది. ఆసక్తికరంగా ఉండే పనితీరు, అధిక వేతనాలు, ఎన్నెన్నో ప్రోత్సాహకాలు ఈ రంగంలో లభిస్తున్నాయి. అయితే, కొన్ని టెక్నాలజీ ఉద్యోగాలు ఇతర ఉద్యోగాలకన్నా మేలైనవంటున్నారు నిపుణులు. అవి ఏంటంటే...
* సాఫ్ట్ వేర్ ఆర్కిటెక్ట్: సగటు వేతనం: 1.30 లక్షల డాలర్లు
జాబ్ స్కోరు: 4.2, కెరీర్ లో అవకాశాల రేటింగ్: 3.4
సాఫ్ట్ వేర్ అప్లికేషన్స్ డిజైన్ చేయడం వీరి విధి. డిజైన్ అయిన అప్లికేషన్స్ ను వివిధ సంస్థలకు ఉపయోగపడేలా వాటిని పర్సనలైజ్ చేయడమూ వీరి బాధ్యత. ఈ విభాగంలో నిష్ణాతులైతే జీవితంలో వెనుతిరిగి చూసుకునే అవసరమే ఉండదు.
* యూఎక్స్ డిజైనర్: సగటు వేతనం: 91,800 డాలర్లు
జాబ్ స్కోరు: 4.3, కెరీర్ లో అవకాశాల రేటింగ్: 3.6
ఓ సాఫ్ట్ వేర్ తయారైన తరువాత యూఎక్స్ డిజైనర్ల పని మొదలవుతుంది. అది ఎంత వరకూ పనిచేస్తుంది? వినియోగదారులకు ఏ మాత్రం ఉపకరిస్తుంది? తదుపరి పనితీరును మెరుగుపరిచేందుకు ఏ చర్యలు తీసుకోవాలన్నది వీరు తేల్చాల్సి వుంటుంది.
* క్యూఏ మేనేజర్: సగటు వేతనం: 85 వేల డాలర్లు
జాబ్ స్కోరు: 4.4, కెరీర్ లో అవకాశాల రేటింగ్: 3.4
ఓ సాఫ్ట్ వేర్ తయారీకి ముందు నిర్దేశించుకున్న పనితీరును చేరుకుందా? లేదా? అన్నది పరిశీలించడం క్వాలిటీ అస్యూరెన్స్ ఇంజనీర్ల విధి. నిపుణులకు ఈ రంగంలోనూ మంచి ప్రమోషన్లు లభిస్తాయి.
* సాఫ్ట్ వేర్ డెవలప్ మెంట్ మేనేజర్: సగటు వేతనం: 1.35 లక్షల డాలర్లు
జాబ్ స్కోరు: 4.4, కెరీర్ లో అవకాశాల రేటింగ్: 3.4
సాఫ్ట్ వేర్ డెవలప్ మెంట్ ప్రాజెక్టుల్లో వీరి పాత్ర అత్యంత కీలకం. సమర్థవంతంగా పనిచేస్తారనుకుంటే, డెవలప్ మెంట్ మేనేజర్లకు ఎంత మొత్తాన్ని ఆఫర్ చేసేందుకైనా ఐటీ కంపెనీలు వెనుకాడవు.
* అనలిటిక్స్ మేనేజర్: సగటు వేతనం: 1.05 లక్షల డాలర్లు
జాబ్ స్కోరు: 4.5, కెరీర్ లో అవకాశాల రేటింగ్: 3.7
విశ్లేషణా సేవలందించే సాఫ్ట్ వేర్ ను నిర్వహించడం వీరి విధి. కంపెనీల సమస్యలను తీరుస్తూ, వారి అన్ని రకాల గణాంకాలనూ మధించి నివేదికలు తయారు చేయడంతో పాటు అత్యధిక సమాచారాన్ని దాచిపెట్టే సర్వర్ల నిర్వహణా వీరి బాధ్యతే.
* సాఫ్ట్ వేర్ ఇంజనీర్: సగటు వేతనం: 95 వేల డాలర్లు
జాబ్ స్కోరు: 4.5, కెరీర్ లో అవకాశాల రేటింగ్: 3.3
ఇది బేసిక్ జాబ్ వంటిది. కంప్యూటర్ ప్రోగ్రామర్లుగా వీరు పనిచేయాల్సి వుంటుంది. అతి తక్కువ స్థాయి నుంచి అత్యున్నత స్థాయికి ఎదిగే అవకాశాలు వీరి సొంతం.
* ప్రొడక్ట్ మేనేజర్: 1.06 లక్షల డాలర్లు
జాబ్ స్కోరు: 4.5, కెరీర్ లో అవకాశాల రేటింగ్: 3.3
సాఫ్ట్ వేర్ డెవలప్ మెంట్, ఐటీ ప్రొడక్టుల డెవలప్ మెంట్ విభాగాల్లో వీరికి పని ఉంటుంది. సంస్థలో వివిధ ప్రాజెక్టుల నిర్వహణ బాధ్యతలూ వీరి భుజస్కంధాలపైనే ఉంటాయి.
* మొబైల్ డెవలపర్: సగటు వేతనం: 90 వేల డాలర్లు
జాబ్ స్కోరు: 4.6, కెరీర్ లో అవకాశాల రేటింగ్: 3.8
ఇది మరో హాట్ జాబ్ ప్రొఫైల్. స్మార్ట్ ఫోన్ల వాడకం పెరిగిపోయిన వేళ, మొబైల్ యాప్స్ తయారు చేయడం, స్మార్ట్ ఫోన్ల ఆపరేటింగ్ సిస్టమ్స్ మెరుగు పరచడం వీరి ఉద్యోగంలో భాగం.
* సొల్యూషన్స్ ఆర్కిటెక్ట్: సగటు వేతనం: 1.19 లక్షల డాలర్లు
జాబ్ స్కోరు: 4.6, కెరీర్ లో అవకాశాల రేటింగ్: 3.5
ఐటీ వ్యవస్థలో అత్యంత క్లిష్టమైన, భారీ డిజైనింగులను తయారు చేసి కస్టమర్లకు అందించే ప్రక్రియలో వీరిదే ప్రధాన బాధ్యత.
* డేటా సైంటిస్టులు: సగటు వేతనం: 1.16 లక్షల డాలర్లు
జాబ్ స్కోరు: 4.7, కెరీర్ లో అవకాశాల రేటింగ్: 4.1
కంపెనీలు కస్టమర్లకు సంబంధించిన మరింత సమాచారాన్ని సేకరిస్తున్న నేపథ్యంలో డేటా సైంటిస్టులకు ఎంతో ప్రాధాన్యత పెరిగింది. ఇక్కడ పనిచేసే వారు తమ యాజమాన్యాలు, క్లయింట్లకు అనువుగా డేటాను క్రోడీకరించడం, ఆపై సమాచార విశ్లేషణ చేసి లోటుపాట్లను గుర్తించడం, పనితీరు మెరగునకు తీసుకోవాల్సిన చర్యలపై సిఫార్సులు చేయాల్సి వుంటుంది.