: తిరుమలలో గణనీయంగా తగ్గిన భక్తుల రద్దీ!
తిరుమలలో భక్తుల రద్దీ గణనీయంగా తగ్గింది. ఓ వైపు స్కూళ్లు నడుస్తుండటం, మరో వైపు చలిపులి పంజా విసురుతుండటంతో భక్తుల రాక మందగించింది. ఈ ఉదయం శ్రీవారి దర్శనం కోసం ఐదు కంపార్టుమెంట్లలో భక్తులు వేచివున్నట్టు టీటీడీ ప్రకటించింది. ఉచిత దర్శనానికి 4 గంటల సమయం పడుతోందని, కాలినడక భక్తులకు 3 గంటల్లోపే దర్శనం పూర్తవుతోందని పేర్కొంది. ప్రత్యేక దర్శనం భక్తులు రెండు గంటల్లోపే స్వామివారిని దర్శించుకుని బయటకు వస్తున్నారని ప్రకటించింది.