: కేసులెందుకు, హెల్మెట్ పెట్టించండి చాలు: హైకోర్టు
తెలుగు రాష్ట్రాల్లో ద్విచక్ర వాహనదారులపై కేసులు పెట్టించి, వారిని కోర్టుల చుట్టూ తిప్పడం తమ ఉద్దేశం కాదని, ప్రమాదాలకు గురికాకుండా చూడాలన్నదే తమ అభిమతమని హైకోర్టు స్పష్టం చేసింది. వాహనదారులు హెల్మెట్ లేకుండా పట్టుబడితే, వారిపై కేసుల నమోదు బదులు, వారికి హెల్మెట్ పెట్టిస్తే సరిపోతుందని, ఈ దిశగా అధికారులు చర్యలు చేపట్టాలని సూచించింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో హెల్మెట్ నిబంధన సరిగ్గా అమలు కావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు, రెండు వారాల్లో ప్రమాణ పత్రం దాఖలు చేయాలని ఆదేశించింది. కాగా, హెల్మెట్లు ధరించడంపై కోర్టులో 2010 నుంచి కేసు నలుగుతున్న సంగతి తెలిసిందే.