: మేయర్ అభ్యర్థిగా విక్రమ్ గౌడ్ ను ప్రకటించిన కాంగ్రెస్
జీహెచ్ఎంసీ మేయర్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ తరపున విక్రమ్ గౌడ్ పేరును ఆ పార్టీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. మేయర్ అభ్యర్థి విక్రమ్ యువకుడని, విద్యావంతుడని, అతనిని అందరూ ఆదరించి ఓటేసి ఆశీర్వదించాలని పిలుపునిచ్చారు. అంతేగాక గ్రేటర్ ఎన్నికల ప్రచారానికి భారీ వ్యూహం రూపొందించామని, క్యాంపెయిన్ కమిటీని ఏర్పాటు చేశామని ఉత్తమ్ తెలిపారు. ఈ కమిటీలో తెలంగాణకు చెందిన నేతలు ఉంటారని ఉత్తమ్ వెల్లడించారు. పార్టీ తరఫున తనను మేయర్ అభ్యర్థిగా ఎన్నుకున్నందుకు ఈ సందర్భంగా కాంగ్రెస్ కు విక్రమ్ గౌడ్ ధన్యవాదాలు తెలిపారు.