: రాజమహేంద్రవరంలో ఉద్రిక్తత...ఆక్రమణలను కూల్చేస్తున్న అధికారులు, అడ్డుకుంటున్న వ్యాపారులు
ఏపీలోని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ప్రధాన నగరం రాజమహేంద్రవరంలో నేటి ఉదయం తీవ్ర ఉద్ర్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిబంధనలకు విరుద్ధంగా వెలిశాయంటూ దానవాయి పేటలోని పలు షాపింగ్ కాంప్లెక్స్ లకు చెందిన సెల్లార్లను కూల్చేసేందుకు కార్పొరేషన్ అధికారులు రంగంలోకి దిగారు. సిబ్బందితో పాటు భారీ ఎత్తున యంత్ర సామగ్రితో వచ్చిన అధికారులు కూల్చివేతలను కూడా ప్రారంభించేశారు. అయితే సమాచారం తెలుసుకున్న ఆయా భవనాల యజమానులు, వ్యాపారులు అధికారులను అడ్డుకునేందుకు తండోపతండాలుగా అక్కడికి చేరుకున్నారు. కూల్చివేతలను అడ్డుకునే క్రమంలో వారంతా అధికారులతో వాగ్వాదానికి దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.