: అలాంటప్పుడు సెట్లో చాలా క్షోభ అనుభవిస్తున్నాను: సుకుమార్

ముందుగానే రాద్దామనుకున్న సీన్లు పూర్తికాకపోవడంతో తీరా సెట్ కు వెళ్లిన తర్వాత వాటిని రాసుకోవాల్సి వస్తోందని.. దీంతో తాను క్షోభ అనుభవిస్తున్నానని దర్శకుడు సుకుమార్ అన్నారు. ఒక టీవీ చానెల్ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. రెండు సినిమాల తర్వాత రిటైర్మెంట్ తీసుకుంటారని సుకుమార్ ఇటీవల ఫేస్ బుక్ లో పోస్ట్ చేసిన విషయమై ఆయన్ని ప్రశ్నించగా...‘ఆ టైమ్ కి నాకు అలా అనిపించింది. అనుకున్న సమయానికి రాయాలనుకున్న సీన్లు పూర్తికాకపోవడంతో.. సెట్ లో ఆర్టిస్టులు, కెమెరామెన్, లైటింగ్ విభాగానికి చెందిన వారు ఇలా ప్రతి ఒక్కరూ వెయిటింగ్ చేస్తూ ఉంటారు. ఒక క్రిమినల్ లా అందరూ నా వైపే చూస్తుంటారు. ఆ గంట సేపు నేను అనుభవించే క్షోభ అంతాఇంతా కాదు. దారుణంగా ఉంటుంది. సీన్ ను కంప్లీట్ చేయలేకపోతున్నానే అని ఒక రకమైన బాధ కల్గుతుంది. అయితే, సినిమాలకు నేనేమి దూరంగా ఉండను. కాకపోతే, సినిమా కథలు రాస్తాను.. ప్రొడ్యూస్ చేస్తాను. చాలా మంది నాతో ఏమంటారంటే.. నా కథను నేనే తెరపైకి ఎక్కించగలనని అంటారు. అయితే, కుమారి 21 ఎఫ్ సినిమా రిలీజు అయిన తర్వాత ఆ భ్రమ నుంచి నేను బయటపడ్డాను. ఎందుకంటే, ఆ సినిమాను అద్భుతంగా దర్శకుడు తెరకెక్కించాడు’ అని సుకుమార్ చెప్పారు.

More Telugu News