: బాబు గురించే అడిగితే చెబుతా..లోకేశ్ ఎవరో నాకు తెలియదు: మంత్రి తలసాని
లోకేశ్ ఎవరో తనకు తెలియదని, చంద్రబాబు గురించి అడిగితే మాత్రం చెబుతానని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఐటీ రంగాన్ని టీడీపీ కంటే టీఆర్ఎస్సే ఎక్కువ అభివృద్ధి చేస్తోందని, ఎంఐఎంతో ఎలాంటి ఒప్పందం తమకు లేదని చెప్పారు. సెటిలర్స్ అనే పదం తనకు నచ్చదని అన్నారు. ఇక్కడ పుట్టిన వారికి, జీవించే వారికి సమానహక్కులు ఉన్నాయని అన్నారు.